ఈ ఐపిఎల్ మొదటి మ్యాచ్ నుండి నువ్వా నేనా అన్న ఫైట్ కొనసాగుతుంది.. ఆల్రెడీ పూణె మీద మ్యాచ్ ఓడిన ముంబై ఎలాగైనా రెండో మ్యాచ్ విన్ అవ్వాల్సిందిగా ఆడింది. ఇక మొదటి మ్యాచ్ గుజరాత్ తో పోటీ పడి విజయం సాధించిన కలకత్తా జట్టు ఈ రెండో మ్యాచ్ కూడా విన్ అవ్వాలని చూసింది.
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కలకత్తా ఆటగాళ్లకు 178 పరుగులు ఇచ్చింది. మనిష్ పాండే 18తో కలకత్తా జట్టులో అత్యధిక స్కోర్ చేశాడు. ఇక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన కలకత్తా ముంబై ముందు 179 పరుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభం అదరగొట్టగా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యేసరికి జట్టు కష్టాల్లో పడ్డది. ఒకానొక దశలో కలకత్తా ముంబై ఇరు జట్టు మ్యాచ్ మీద పట్టు సాధించాలని చూశాయి. ఫైనల్ ఓవర్ దాకా మ్యాచ్ ఉత్కంఠంగా సాగడం విశేషం. హార్దిక్ పాండ్య 11 బాల్స్ కు 29 అత్యంత మెరుగైన అవసరమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఈ విజయంతో ముంబై జట్టు మొదటి విజయం సాధించింది.