ఐపిఎల్ 2017 : చెలరేగిన పంజాబ్ ముంబైపై ఘనవిజయం..!

shami
ప్లే ఆఫ్ ఆశలను పదిలం చేసుకునే ప్రయత్నంలో మ్యాచ్ లన్ని ఉత్కంఠతతో సాగుతున్నాయి. పాయింట్ల పట్టికలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకి చెమటలు పట్టేలా చేసి ఓడించారు పంజాబ్ జట్టు. ఐపిఎల్ అభిమానుల దాహం తీర్చేలా ముంబై వర్సెస్ పంజాబ్ పరుగుల వరద సృష్టించింది.


టాస్ గెలిచిన ముంబై పంజాబ్ కు బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చింది. ఇక ఎన్నడు లేని విధంగా పంజాబ్ ఆటగాళ్లు అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించారు. ఓపెనర్లు గప్టిల్ 36, వృద్ధిమాన్ సాహా అజేయంగా 93 పరుగులతో పంజాబ్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. మ్యాక్స్ వెల్ 47, షాన్ మార్ష్ 25 పరుగులు చేయగా పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగులు చేసింది. ఈ ఐపిఎల్ లో అత్యధిక స్కోర్ ఇదే అని చెప్పొచ్చు.  


ఇక భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆరంభం అదరగొట్టినా లాభం లేకుండా పోయింది. ఓపెనర్లు సిమన్స్ 59, పార్ధివ్ పటేల్ 39 మెరుపు వేగంతో పరుగులు తీయగా రోహిత్ శర్మ 5 పరుగులే చేసి అవుట్ అవడం తో దెబ్బ పడింది. ఇక పొలార్డ్ 50, హార్ధి పాండ్య 30 పరుగులు చేసినా 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 7 పరుగుల తేడాతో ముంబై పంజాబ్ భారీ విజయం అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: