సొంతగడ్డపై చెలరేగిన...“చాలెంజర్స్‌”

Bhavannarayana Nch

బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ చెలరేగిపోయారు..సమిష్టిగా ఆడి జట్టుని విజయపధంలోకి తీసుకుని వెళ్ళారు..దాంతో ఒక్కసారిగా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు..శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది...ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ముందుగా బౌలింగ్‌లో ఉమేశ్‌, సుందర్‌లు చక్కని ప్రతిభ కనబరిచారు

 

అయితే..బ్యాటింగ్‌లో డివిలియర్స్ 57 పరుగులని 40 బంతులు‌..2 ఫోర్లు, 4 సిక్సులు, డికాక్‌ 45 పరుగులు 34 బంతులు,7 ఫోర్లు, ఒక సిక్సు..బ్యాట్‌ను ఝులిపించారు. దీంతో కింగ్స్‌పంజాబ్‌ జట్టుపై చాలెంజర్స్ తమ విజయకేతనం ఎగురవేశారు...అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ జట్టు 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్‌ అయింది. పంజాబ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 47 పరుగులని 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు..చేయగా...కరుణ్‌ నాయర్‌ 29 పరుగులని 26 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి  స్కోర్ ని పరుగులు పెట్టించాడు అయితే

 

చివర్లో కెప్టెన్‌ అశ్విన్‌ 33 పరుగులలో 20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు కొట్టి  ఫర్వాలేదనిపించడంతో పంజాబ్‌ గౌరవ ప్రదమమైన స్కోరు చేయగలిగింది...అయితే 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్‌లో మెకల్లమ్‌ గోల్డెన్‌ డకౌట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మరో ఓపెనర్‌ డికాక్‌తో కలసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్‌ వరుస బంతుల్లో డికాక్‌, సర్ఫరాజ్‌ఖాన్‌లను పెవిలియన్‌ చేర్చాడు..ఈ దశలో డివిలియర్స్‌ 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

 

ఇదిలా ఉంటే చివర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్‌ బౌండరీ లైన్‌ వద్ద కరుణ్‌ నాయర్‌కు చిక్కాడు..వెనువెంటనే మన్‌దీప్‌ కూడా అవుట్ అవ్వడంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది...చివరికి మూడు పరుగుల లక్ష్యాన్ని ఒక్క ఫోర్ కొట్టి జట్టుకి విజయాన్ని అందించారు..సొంతగడ్డపై విజయం చాలెంజర్స్ కి భారీ విజయాన్ని అందించినట్టే


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: