“రాహుల్ ద్రావిడ్” పై బీసీసీఐ “షాకింగ్ డెసిషన్”

Bhavannarayana Nch

“వాల్  ఆఫ్ క్రికెట్” అని పిలుచుకునే  భారత ఇండియన్ క్రికెట్  ఆటగాడు రాహుల్ ద్రావిడ్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు..ఎన్నో సార్లు జట్టుకు కీలక విజయాలు అందించాడు..ఎంతో డీసెంట్ ప్లే చేస్తూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తరువాత  భారత అండర్ -19 జట్టుకి కోచ్ గా ఎన్నికయ్యాడు అంతేకాదు

 

అండర్ -19కి ప్రపంచకప్ రావడంలో కీలక పాత్ర పోషించాడు ద్రావిడ్..తన హయాంలో జట్టుకి  వరల్డ్ కప్ తీసుకు రావడంలో రాహుల్ కృషిని గుర్తించిన బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ ని ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేసింది..అయితే రాహుల్‌ ఎంపికపై బోర్డులోనే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్రావిడ్‌ పేరును నామినేట్‌ చేయడమంటే ఎంతో మంది క్రికెటర్ల ప్రతిభను చిన్ననాడే పసిగట్టి వారిని సానబెట్టిన గురువులకు అన్యాయం చేసినట్టేనని బోర్డు అధికారులు సంచలన వ్యఖ్యలుక్ చేశారు అయితే

 

అయితే అండర్‌-19, ఎ జట్టుకు ద్రావిడ్‌ చేసిన సేవలు వెలకట్టలేనివే అయినా సరే కోచ్‌గా ద్రావిడ్ అనుభవం మాత్రం మూడేళ్ళ అన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని అన్నారు..ఎంతో మంది ఏళ్ల తరబడి కోచ్ ల ఉంటూ ఇక్కడ సర్వం అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు వారి కష్టాన్ని కూడా మనం గుర్తించాలి అని అన్నారు బీసీసీఐ లోని ఒక అధికారి..అయితే ఫైనల్ గా బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: