ధోని ఫిక్స్ అయితే వార్ వన్ సైడే..!

shami
భారత క్రీడా అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు ఎం.ఎస్ ధోని. స్టేడియం ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా ధోని ఫిక్స్ అయ్యాడంటె వార్ వన్ సైడ్ అయినట్టే. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మనే కాని ఓపెనర్ కంటే అరాచకంగా ఆడతాడు. టార్గెట్ ఎంత పెద్దదైనా సరే నిలకడగా ఆడుతూ చివర్లో విజృంభించి జట్టుకి విజయాన్ని అందిస్తాడు.


క్రీజ్ లో ధోని ఉంటే ప్రత్యర్ధులకు చుక్కలే.. ఎలాంటి సందర్భాల్లో అయినా సరే నిలకడగా ఆడగలిగే సత్తా ఉన్న ఏకైక బ్యాట్స్ మెన్ ధోని. కెప్టెన్ గా భారత జట్టుకి ఎన్నో గొప్ప విజయాలను అందించడమే కాదు 2011లో వరల్డ్ కప్ కూడా తన కెప్టెన్సీలో వచ్చేలా చేశాడు. తానో కెప్టెన్ అన్న గర్వం ధోనిలో ఎప్పుడూ కనబడలేదు.


అంతేకాదు విరాట్ కొహ్లి లాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించిన మంచితనం ధోనిది. ప్రస్తుతం కెప్టెన్ గా విరాట్ కొహ్లి లోని ఈ దూకుడు తనం ధోని ముందే పసిగట్టాడు కాబట్టే అతని కెప్టెన్సీలో కొహ్లికి తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ధోని కెప్టెన్సీలో జట్టు గెలిచినా ఓడినా ఎలాంటి హంగామా చేయడు. అందుకే ఆయన్ను మిస్టర్ కూల్ అంటారు క్రీడా అభిమానులు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: