యాషెస్ తొలి టెస్ట్ : ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా
13/0 స్కోర్ తో 5వరోజు ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాడ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 11 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోరి బర్న్స్ ను కమ్మిన్స్ పెవిలియన్ కు పంపించగా ఆతరువాత జాసన్ రాయ్ తో కలిసి కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుతమైన బంతితో లయన్, రాయ్ వికెట్ తీయడంతో అక్కడినుండి ఇంగ్లాండ్ పతనం మొదల్యయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పయి ఓటమి చవి చూసింది. 37 పరుగులతో వోక్స్ ఒక్కడే కాసేపు పోరాటం చేశాడు.
అద్భుతంగా బౌలింగ్ చేసిన నాథన్ లాయన్ 6 వికెట్లు పడగొట్టగా కమ్మిన్స్ 4 వికెట్లు ను ఖాతలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇనింగ్స్ లో కూడా సెంచరీ చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సిరీస్ లో రెండో టెస్ట్ ఈనెల 14న ప్రారంభం కానుంది.