న్యూడ్ ఫోటోతో షాక్ ఇచ్చింది.. ఇప్పుడు మళ్లీ ఇంకో షాక్..?

Chakravarthi Kalyan

ఆమె ఓ క్రికెటర్.. కొన్నాళ్ల క్రితం తన న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మహిళల ఆరోగ్య సమస్యలపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఆ పని చేసింది. అప్పట్లో అదో సంచలనం అయ్యింది. ఆమె ఫోటో ద్వారా ఆ ప్రాబ్లమ్ పై డిస్కషన్ జరిగింది.


ఆమే ఇంగ్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కీపర్‌ సారా టేలర్‌. దాదాపు 13 ఏళ్ల కెరీర్ ఆమె సొంతం.. మూడు ఫార్మాట్లలో 226 మ్యాచులు ఆడింది. 6,533 పరుగులు చేసింది. 232 వికెట్లు తీసుకుంది. మహిళల క్రికెట్లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.


కానీ కొంత కాలంగా ఆమె డిప్రెషన్ కారణంగా ఇబ్బంది పడుతోంది. ఈ జబ్బుతో ఆటను ఎంజాయ్ చేయలేకపోతోందట. అందుకే.. ఇప్పుడు అకస్మాత్తుగా రిటైర్‌ మెంట్ ప్రకటించింది. ఈ జబ్బుతో ఇక తాను ఆటను కొనసాగించలేనంటోంది సారా.. ఇన్నాళ్ల తన కెరీర్ పట్ల ఆమె చాలా సంతోషం ప్రకటించింది.


2006లో నా కల నెరవేరింది. ఇన్నేళ్లలో ఉత్తమ క్రీడాకారులతో కలిసి సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నాను. నా ఆరోగ్యం దృష్ట్యా వీడ్కోలు పలికేందుకు నాకిదే మంచి సమయం. ఇంగ్లాండ్‌ జెర్సీలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించాను. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది సారా టేలర్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: