బాహుబలి బౌలర్ ఇరగదీస్తున్నాడు..!
140 కేజీల బరువు..! ఆరడుగుల పొడవు..! ఇంత భారీకాయంతో నడవడమే కష్టం. అలాంటిది.. పిచ్ మధ్య పరుగెడుతూ...తన బౌలింగ్‌తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు ఓ బౌలర్. భారీకాయంతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు. తన స్పిన్ మాయజాలంతో.. ఆఫ్గాన్‌ను కోలుకోలేని దెబ్బతిశాడు.
విండీస్, ఆఫ్ఘాన్ మధ్య జరుగుతున్న టెస్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రకీమ్ కార్నివాల్. తన ఆకారంతోనే కాదు... బౌలింగ్‌తోనూ మెస్మరైజ్ చేస్తున్నాడు. భారీకాయాన్ని లెక్క చేయకుండా... ఇరగదీస్తున్నాడు. తన స్పిన్ మాయజాలంతో ఆఫ్గాన్‌ను కుప్పకూల్చి రికార్డు సృష్టించాడు బాహుబలి బౌలర్.
రెండో ఇన్నింగ్స్‌లోనూ రకీమ్ కార్న్‌వాల్ చెలరేగి ఆడాడు. అతడి ధాటికి ఆఫ్ఘాన్ ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ మ్యాచ్‌లో కార్న్‌వాల్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో భారత పిచ్‌లపై 10 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన రకీమ్... రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. దీంతో విండీస్ సేఫ్ జోన్లో నిలిచింది.
26 ఏళ్ల కార్నివాల్‌కు ఇది రెండో అంతర్జాతీయ టెస్ట్‌మ్యాచ్. భారీకాయం వల్లా ఆలస్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి బరువు 140 కేజీలు. ప్రపంచంలో అత్యంత బరువైన టెస్ట్ క్రికెటర్ రకీమ్ అంటూ కథనాలు వస్తున్నాయి. ఐతే ఐసీసీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా బాహుబలి బౌలర్ అంటూ రకీమ్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అంత లావు.. అంత హైట్ ఉండి కూడా ఆయన బౌలింగ్ చేస్తున్న తీరు చూసి క్రికెట్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన టాలెంట్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.