క్రికెట్ కోసం పానీపూరీ కూడా అమ్మడు.. చివరికి ఇప్పుడు ఇలా!
క్రికెట్ ఆడటమంటే మామూలు విషయం కాదు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతో పట్టుదలతో.. ఇంకెంతో ప్రాక్టీస్ ఉంటే కానీ క్రికెట్ లో విజయం సాధించలేరు. క్రికెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కొంతమంది క్రికెట్ లో రాణించాలనే పట్టుదల చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఇక్కడ ఓ ఆటగాడు. చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే అమితమైన ప్రేమను పెంచుకున్నారు. ఎలాగైనా ఇండియా టీమ్ కు ఆడాలనే దృఢ సంకల్పంతో చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగాలని అనుకున్నాడు . చిన్న చితకా పనులు చేసుకుంటూనే క్రికెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏకంగా రెండు కోట్లకు పైగా ధర పలికాడు ఈ ఆటగాడు.
అతని 17 ఏళ్ళ యశస్వి జైస్వాల్... చిన్నప్పుడు నుంచి క్రికెటర్ కావాలనే కలతోనే బతికాడు. తన కలను సాకారం చేసుకునేందుకు ఎంతటి కష్టమైన భరించాలని అనుకున్నాడు. క్రికెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాల్లో ఉన్న క్రికెట్ ను మాత్రం మరువలేదు. తిండి లేకపోయినా.. ఇల్లు లేక పోయినా క్రికెట్ ప్రాక్టీస్ మాత్రం చేస్తూనే ఉండేవాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశస్వి జైస్వాల్ ... కనీసం ఉండటానికి చోటు లేక మూడేళ్లపాటు టెంట్ కిందే గడిపాడు. పానీపూరి పండ్లు అమ్ముతూ కష్టాలు పడుతూనే మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు యశస్వి జైస్వాల్ .
ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో పరుగుల వరద పారించాడు ఈ యువ ఆటగాడు. రంజి టోర్నీలో ముంబై తరఫున ఆడిన యశస్వి జైశ్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు యశశ్వి జైశ్వాల్ . అతనికి ఒక మంచి అవకాశం వరించింది. ఐపీఎల్ వేలంలో ఏకంగా 2.40 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ టీం ఈ యువ ఆటగాడిని సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ ఆడటమే కాదు ... భారత జట్టులో చోటు సంపాదించడంతోనే తన కల సాకారమవుతుందని యశస్వి జైస్వాల్ చెబుతున్నాడు. యశస్వి జైస్వాల్ వీరగాధ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. అయితే ప్రతి ఏడు ఐపీఎల్ యాజమాన్యం యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ..యువ ఆటగాళ్ళ లోని ప్రతిభను వెలికి తీస్తున్న విషయం తెలిసిందే.