వన్డే, టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకిన కోహ్లీ..

Suma Kallamadi

ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఫోర్భ్స్ ఇండియా తాజాగా ప్రకటించిన టాప్ సెలబ్రిటీస్-100, 2019 లిస్టులో కోహ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది 252.72 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాది రెండో ప్లేస్‌లో నిలిచిన కోహ్లీ.. ఈసారి సత్తాచాటి నం.1కు ఎగబాకాడు. ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ ఇండియా వెలువరించిన టాప్-100 సెలబ్రిటీస్ లిస్టు 2019లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. దేశంలోని అందరూ సెలబ్రిటీలను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. టాప్-20లో ధోనీ, సచిన్, రోహిత్ స్థానం దక్కించుకున్నారు.


టీ20 సిరీస్‌లో విండీస్‌ బౌలర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ను 'నోట్‌ బుక్‌' సెలబ్రేషన్‌ ద్వారా ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. చివరి టీ20లో సిక్స్ కొట్టిన అనంతరం కూడా నియంత్రణ కోల్పోయాడు. చెన్నై వన్డేలో రవీంద్ర జడేజా రనౌట్‌ అయిన విషయంలో కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. అంపైర్ మీద అసహనం వ్యక్తం చేస్తూ బౌండరీ లైన్ వద్దకు వచ్చేసాడు. కోహ్లీ అలా దూకుడుగా ఉండడంతో రెండో వన్డే అనంతరం పొలార్డ్‌ పరోక్షంగా ప్రస్తావించాడు.


పొలార్డ్‌ పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో కోహ్లీ మాట్లాడుతూ... 'కోహ్లీ అత్యుత్సాహానికి నాకు జవాబు తెలీదు. మైదానంలో ఎప్పుడూ అంత దూకుడుగా ఎందుకు ఉంటాడో తెలుసుకోవాలి. అలా ఎందుకు ఉంటాడో కోహ్లీని మీరే అడగండి. నాకైతే తెలీదు. కోహ్లీని అడిగి నాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది' అని పేర్కొన్నాడు. రెండో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 388 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విండీస్‌ విఫలమైంది. 280 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాయ్‌ హోప్‌ (78), నికోలస్‌ పూరన్‌ (75)లు హాఫ్‌ సెంచరీలు చేశారు.


రెండో వన్డేలో వెస్టిండీస్‌ పొలార్డ్‌, కోహ్లీలు ఎదుర్కొన్న తొలి బంతికే 'గోల్డెన్‌ డక్‌'గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. మహ్మద్‌ షమీ వేసిన 30 ఓవర్‌ రెండో బంతికి నికోలస్‌ పూరన్‌ ఔట్‌ కాగా.. ఆ మరుసటి బంతికి పొలార్డ్‌ ఔటయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌ పైకి వేసిన బాల్‌ను పొలార్డ్‌ షాట్ ఆడగా.. అది కాస్తా ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్ చేరాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: