టెస్ట్ మ్యాచుల్లోనూ మనోడే తోపట..?

praveen

ఆటగాడు బ్యాట్ పడితే  సంచలనమే... మైదానంలోకి దిగితే ఇక యుద్దమే అన్నట్లుగా ఉంటుంది ఆ ఆటగాడు ఆట. బరిలోకి దిగాడు అంటే విజయం సాధించాల్సిందే ఇది ఆటగాడి నైజం. ఈ ఆటగాడు తన ప్రతి మ్యాచ్ లో ఇది గెలవక పోతే  తర్వాత మ్యాచ్  ఉండదు అనేంతలా  తన సత్తా చాటాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి రికార్డుల రారాజు గా మారిపోయాడు. అతనే  టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎన్నో సంచలన రికార్డులు.. ఖాతాలో ఎన్నో పరుగులు ... తన ఆటతో  ఇండియాకు ఎన్నో విజయాలు... ఇలా ప్రతి విషయంలో దూసుకుపోతూ తన సత్తా చాటుకున్నాడు విరాట్ . విరాట్ కోహ్లీ కి ఫాలోయింగ్  కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతో మంది. 

 

 

 

 గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో టాప్ లో నిలుస్తూ దూసుకుపోతున్నాడు విరాట్ . టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే మ్యాచ్ అయినా టి20 మ్యాచ్ అయిన.. మ్యాచ్  ఏదైనా రికార్డులు బద్దలు కొట్టాల్సిందే అన్నట్టుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలకు సాధ్యమైన రికార్డులను అతి తక్కువ కాలంలో చేరుకున్నారు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ప్రపంచ మేటి  బ్యాట్ మెన్స్ లో  మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక బ్యాటింగ్  పరంగానే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా టీం మొత్తం ఒక్క తాటిపై నడిపించే ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు అంటే బౌలర్ ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మైదానంలో పరుగుల వరద పారాల్సిందే  అన్నట్లుగా ఉంటుంది విరాట్ కోహ్లీ ఆట. 

 

 

 ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డుకు  సిద్ధమయ్యాడు. ఫార్మాట్ లతో సంబంధంలేకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో తనకు సాటిలేదని మరోసారి నిరూపించాడు. ఇప్పటికే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో  కూడా టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు టీమిండియా డేర్ అండ్ డాషింగ్ క్యాప్టెన్  కోహ్లీ . 928 పాయింట్లతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా 911 పాయింట్లతో ఆసిస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్  రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఈసారి కూడా టాప్ ప్లేస్ లో నిలిచాడు మనోడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: