భారత మహిళా క్రికెట్‌లో ఆమె భవిష్యత్ మహారాణే..!
ఇక దేశవ్యాప్తంగా టీం ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ టోర్నమెంట్‌లో భారత జట్టులో ఓవరాల్‌గా హైలెట్ అవుతోంది టీనేజ్ ఓపెనర్ షఫాలీ. ఆమెపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తొలి నుంచి దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. దీంతో విమర్శకులు సైతం ఆమె దూకుడుకు ఫిదా అవుతున్నారు.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో కేవలం 16 ఏళ్ల షపాలీ ఎలాంటి బెరుకు లేకుండా దూకుడుగా ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సీనియర్ మహిళా క్రికెటర్లు సైతం ఈ వయస్సులో ఆమె దూకుడు ఆటతీరు చూసి ముచ్చట పడుతున్నారు. షపాలీ భావి భారత క్రికెట్‌కు మంచి ఆశాకిరణమని అంటున్నారు. మరో యంగ్ క్రికెటర్ రోడ్రిగ్స్ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్‌గా రాణిస్తోంది.