ధనాధన్ ధోని..! 5 బంతుల్లో 5 సిక్సులు...!!
కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ - 2020 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్లు కొట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్యే చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ, చిన్నస్వామి స్టేడియంలో సురేశ్ రైనాతో కలిసి నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో తాజాగా నెట్స్ లో ధోనీ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్, ధోనీ 6,6,6,6,6 వీడియోని పోస్ట్ చేసింది.
ధోని 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ధోనీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తన ఫామ్ ని అందుకున్నట్లు కనిపిస్తోంది.
దాదాపు పూర్తిగా ఏడు నెలలు ఆటకి దూరంగా ఉన్నా, ప్రాక్టీస్ సెషన్ లో మాత్రం ధోనీ చక్కగా బంతిని బ్యాట్ కి మిడిల్ చేస్తూ సిక్సర్లు బాదడం అందర్నీ కట్టిపారేస్తోంది. మరి ముఖ్యంగా ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతుల్ని కూడా ధోనీ చిన్నపాటి కదలికలతో మిడ్ వికెట్ దిశగా సిక్స్ గా తరలించిన తీరు అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి స్పష్టం రుజువు చేసింది. ఈ సంవత్సరం అక్టోబరులో జరిగే టీ - 20 ప్రపంచకప్ లో ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడు.