భారత్ ఓటమి తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది..?
ఎన్నో ఆశలతో ఫైనల్ పోరులో అడుగుపెట్టిన భారత్ కు నిరాశ ఎదురైనా విషయం తెలుసిందే. భారత ఉమెన్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన భారత్ నిరాశతో వెనుదిరగాల్సినా పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు అంతకుమించిన ఆకాంక్షల మధ్య.. టి20 మహిళ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు కు ఒక్క అడుగు దూరంలో బోల్తాపడింది. లీగ్ దశలో ప్రతి ఒక్క జట్టును ఓడిస్తూ విజయపరంపర కొనసాగిస్తు దూసుకుపోయిన హర్మన్ సేన... ఫైనల్ పోరులో మాత్రం ప్రత్యర్థి జట్టుకు విజయాన్ని అప్పజెప్పింది.ఫైనల్ పోరులో పూర్తిగా తేలిపోయింది మహిళల జట్టు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళల జట్టు వరల్డ్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ నిరాశే ఎదురైంది.
లీగ్ దశలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఫైనల్ పోరులో మాత్రం సత్తా చాట లేకపోయింది. లీగ్ దశలో ఎంతో అద్భుతంగా రాణించి టీమిండియా ప్రేక్షకులందరిలో ఆశలు నింపిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో మాత్రం సత్తా చాట లేకపోయింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ లక్ష్యాన్ని భారత జట్టుకు నిర్ధేశించినప్పటికీ... భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ పై అందరికీ నమ్మకం ఉంది. కానీ తొలి ఓవర్లోనే ఊహించని విధంగా అవుటై తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది షఫాలీ వర్మ. అంతకుముందు లీగ్ మ్యాచ్లలో విజృంభించి ఆడిన భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ అవుట్ కావడంతో భారత్ ఓటమికి పునాదిరాయి పడినట్లు అయింది. ఇక భారత ఆటగాళ్లు అందరూ ఎంతగా ప్రయత్నించినప్పటికీ చివరికి భారత్ ఫైనల్ పోరులో ఒక్క అడుగు దూరంలో ఓటమిపాలై తీవ్ర నిరాశతో వెనుదిరిగింది..
ఇక భారత ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతం అయ్యింది. భారత మహిళ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్... సహచర క్రికెటర్లు షఫాలీ ని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్చింది షఫాలీ. ప్రస్తుతం షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి . దీంతో క్రికెట్ అభిమానులు అందరూ ఆమెకు బాసటగా నిలిచారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను గడగడలాడించావు . ఈ ప్రతిభకు అనుభవం తోడైతే భారత మహిళల జట్టు కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తావు అంటూ.. నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
It's ok Shafali verma, you've achieved more than what a 16 year old can do 🔥🔥 don't be sad 😭😭 We are proud you
shafali #T20WorldCup #INDvAUS #TeamIndia #T20WorldCupFinal pic.twitter.com/smd68dEp5s — Official Vikash Kumar Verma (@Officialverma5) March 8, 2020