మాజీ స్పిన్నర్ హర్భజన్ కి చేదు అనుభవం.. బ్యాట్ దొంగలెత్తుకెళ్లారు..?
క్రికెట్ ప్రేక్షకుల్లో హర్భజన్ సింగ్ ఆటకి.. అతడి స్పిన్ మాయాజాలానికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. టీమిండియాలో కీలక స్పిన్నర్ గా ఎన్నో రోజుల పాటు కొనసాగి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. కేవలం టీమ్ ఇండియా లోనే కాకుండా అటు ఐపీఎల్ లో కూడా తన సత్తా చాటి జట్టులో కీలక బౌలర్ గా మారిన విషయం తెలిసిందే. అటు టీమిండియాలో ధోనీ సారథ్యంలో అద్భుతాలు సృష్టిస్తూనే... ఇటు చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా మరోసారి ధోనీ సారథ్యంలో తన స్పిన్ మాయాజాలంతో మరెన్నో కీలక వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు.
ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కి చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హర్భజన్ సింగ్ కి ఎదురైన ఘటన తో హర్భజన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా... హర్భజన్ బ్యాట్ దొంగిలించబడినది. శనివారం హర్భజన్ సింగ్ ముంబై నుంచి కోయంబత్తూర్ కు విమానంలో ప్రయాణించాడు. ఈ క్రమంలోనే కోవై లో దిగిన తర్వాత తన కిట్ బ్యాగ్ బరువు తక్కువగా అనిపించింది. దీంతో అనుమానం వచ్చి కిట్ బ్యాగ్ తెరిచి చూడగా... తన కిట్ బ్యాగ్ తెరిచి చూడగా బ్యాట్ కనిపించలేదు. దీంతో హర్భజన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఇక వెంటనే సోషల్ మీడియా వేదికగా ఇండిగో విమానయాన సంస్థలకు ఫిర్యాదు చేశారు హర్భజన్ సింగ్. తన బ్యాట్ దొంగలించ బడినది అని విచారించి దానిని గుర్తించాలి అంటూ సూచించారు. ఇండిగో విమానయాన సంస్థ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి అంటూ డిమాండ్ చేశాడు. అయితే హర్భజన్ సింగ్ అభ్యర్థనపై స్పందించిన ఇండిగో విమానయాన ప్రతినిధి ఒకరు బ్యాట్ కనుగొనేందుకు ప్రయత్నిస్తాము అంటూ హామీ ఇచ్చారు.