టెండూల్కర్ ను అవుట్ చేయటానికి అలా చేసే వాళ్ళం..???

praveen

ప్రపంచ క్రికెట్ లో  భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో సేవలందించి.. భారత క్రికెట్ ఖ్యాతిని  ప్రపంచ నలుమూలల వ్యాపింపజేసిన గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్. అభిమానులందరూ సచిన్ టెండూల్కర్ ను మాస్టర్ బ్లాస్టర్... లేదా లిటిల్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే సచిన్ టెండుల్కర్ ఒకసారి బ్యాట్ పట్టి  మైదానంలోకి అడుగు అంటే పరుగుల వరద పారాల్సిందే . ప్రత్యర్థి జట్టు ఏదైనా... మైదానం ఎక్కడైనా.. ప్రత్యర్థి బౌలర్లు  ఎవరైనా... భారీ బౌండరీలు కొడుతూ భారీ స్కోరు నమోదు చేసేవాడు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలి అన్న బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేది . 

 

 అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ గురించి దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్కై స్పోర్ట్స్ తో మాట్లాడిన పొలాక్ ... తన తరంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాట్ మెన్ అంటూ కొనియాడారు. తమ జట్టు  భారత్ తో మ్యాచ్  ఆడినప్పుడు లిటిల్ మాస్టర్ ను అవుట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించే  వాళ్ళం కాదని సచిన్  తప్పు చేసే వరకు ఎదురు చూసేవాళ్లం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్ ను  చేసే అవకాశం మాత్రం చాలా తక్కువ వచ్చేది తెలిపాడు పొలాక్ . ఎందుకంటే ఎలాంటి పరిస్థితులలో  ఆడటంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆరితేరాడని ... పరిస్థితులు తొందరగా అంచనా వేయగలరు అని తెలిపాడు. 

 

 

 కాగా ఇప్పటి వరకు పొలాక్  సచిన్ టెండూల్కర్ తొమ్మిదిసార్లు వన్డేల్లో అవుటయ్యాడు. సచిన్ ను అత్యధిక సార్లు చేసిన బౌలర్ల  జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు పొలాక్ .కాగా  అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల బాధిత బ్యాట్స్మన్ గా సచిన్  రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక తన అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. సచిన్  మైదానంలో ఆడుతున్నంత సేపు ఆట రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: