అప్పటి నుంచే వారిద్దరూ స్నేహితులట ....! తెలుసా మీకు ...?

Suma Kallamadi

సౌరబ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ ప్రపంచంలో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి ఎవరంటే మొదటగా చెప్పుకునే పేర్లు వీరిద్దరివే. 90వ దశకంలో టీమిండియాకు ఓపెనింగ్ చేస్తూ వీరిద్దరు ఎంత అద్భుతంగా రాణించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాల్ని అందించారు. ఇప్పటికీ 90 వ దశకంలోని క్రికెట్ మ్యాచ్ లు వస్తున్నాయి అంటే చాలామంది గంగూలి, సచిన్ బ్యాటింగ్ కోసం టీవీని అలా చూస్తూ కూర్చుండి పోతారు.

అయితే వీరిద్దరి స్నేహం టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి కాదు. అంతకుముందే అండర్ 15 స్థాయిలోనే వీరిద్దరు కలిసి ఆడారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి స్నేహం ఉండేదట. ఇక దానితో కాలం గడుస్తున్న కొద్దీ ఒకరి మీద ఒకరికి మరింత గౌరవం ఆప్యాయత బాగా పెరిగింది. ఇక అసలు విషయానికి వస్తే... లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇక ఇదే కోవలోకి మన సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు.

ఇకపోతే వీరిద్దరూ టీమిండియా క్రికెట్ ఆడుతున్న సమయంలో లిటిల్ మాస్టర్ ఒకసారి సౌరవ్ గంగూలీ వారి ఇంటికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా గంగూలీ తల్లి నిరుపమా గంగూలీ మాస్టర్ బ్లాస్టర్ కు ఇష్టమైన వంటకాలను వండి వడ్డించారు. అయితే అప్పటికి జ్ఞాపకాన్ని తాజాగా సచిన్ తన ఇంస్టాగ్రామ్ పోస్టు ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్ గా దాదా ఇంట్లో గడిపిన సంతోషకరమైన సాయంత్రం గత స్మృతులు అని రాసుకోచ్చాడు. అయితే ఆ ఆతిధ్యం నాకు చాలా బాగా గుర్తు ఉందని ఈ సందర్భంగా గంగూలీ తల్లిని గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఆమె బాగున్నారు అని ఆశిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: