డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక బౌలర్...!

Kothuru Ram Kumar

తను ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లోనే హ్యట్రిక్ తీసి అందరి చూపు ఆకట్టుకున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షెహన్ మధుశంకా నేడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. షెహన్ మధుశంకా  గాయం కారణంగా 2018 నుంచి శ్రీలంక టీం నుండి ఈ బౌలర్  దూరం అయిపోయాడు.


అయితే ఇంకా కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి బ్యాంకు లో లాక్ డౌన్ అమలు కొనసాగుతుండగా... ఇటీవల నిబంధనలు అన్ని సడలించారు. అయితే ఇదే అదునుగా తన స్నేహితుడితో కలిసి కారులో పన్నాల రోడ్డుపై వెళ్తున్న షెహన్ మధుశంకాన్ని పోలీసులు ఆపారు. పోలీసు ఆపడమే కాకుండా వారిని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో షెహన్ మధుశంకా  వద్ద రెండు గ్రాముల హెరాయిన్ లభించడంతో అతనిపై కేసును నమోదు చేశారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అతనిని రెండు వారాల కస్టడీకి మెజిస్ట్రేట్ ఆదేశించడం జరిగింది.


ఇక కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 20వ తేదీ నుండి ఇప్పటి వరకు శ్రీలంకలో దాదాపు 65 వేల మంది లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి  అరెస్ట్ అయ్యి జైలు పాలైన వారు ఉన్నారు. ఇందులో కేవలం సామాన్యులే కాకుండా చాలా మంది ప్రముఖులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.

అయితే తాజాగా శ్రీలంక క్రికెటర్ కూడా ఈ జాబితాలో చేరడం విడ్డూరం. అయితే ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: