2011 వరల్డ్ కప్ భారత్ గెలిచేది కాదు... ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు.. విచారణ జరపాలన్న ఆటగాళ్లు..?

praveen

2011 వన్డే వరల్డ్ కప్ శ్రీలంక భారత్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిళ మహిదానంద  చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి . ఇక దీనిపై శ్రీలంక క్రికెటర్లు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ అయిన కుమార సంగక్కర, జయవర్దనే లు శ్రీలంక క్రీడల  మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఖండించారు. తాజాగా మాజీ క్రీడల శాఖ మంత్రి ఆరోపణలను ఖండించిన ఆటగాళ్ల జాబితాలో మరో ఆటగాడు వచ్చి చేరాడు  . అరవింద డిసిల్వా కూడా మాజీ క్రీడల మంత్రి ప్రపంచకప్  మ్యాచ్ ఫిక్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఖండించారు. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో ఖండించిన అరవింద డిసిల్వా... భారత ప్రభుత్వం బీసీసీఐ  కూడా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 


 ఏం జరిగింది అనేది తేల్చాలని.. ఇవి  ఎంతో దారుణమైన ఆరోపణలు అని తెలిపాడు. పారదర్శకత తీసుకురావడం కోసం పూర్తిస్థాయిలో దీనిపై విచారణ చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ కి గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపిన అరవింద డిసిల్వా... 2011 వరల్డ్ కప్ విజయాన్ని సచిన్ టెండూల్కర్  ఎంతో ఆస్వాదిస్తారు అంటూ తెలిపారు. కోట్లాదిమంది క్రికెట్ అభిమానుల అభిరుచి ఆసక్తి తనకు తెలిసు  అంటూ తెలిపారు అరవింద డిసిల్వా . అయితే శ్రీలంక మాజీ క్రీడల మంత్రి చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకొని బిసిసిఐ నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. 

 


 ఇలాంటి తప్పుడు ఆరోపణలు కారణంగా ప్రజలు లేనిపోని అపోహలు  వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ సాధించి లంక ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించిన అరవింద డిసిల్వా  ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం మాజీ క్రీడల శాఖ మంత్రి మహదానంద ఓ ఇంటర్వ్యూలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది శ్రీలంక గెలవాల్సింది  ఫిక్సింగ్ కారణంగా భారత్ గెలిచింది అని ఆయన చెప్పుకొచ్చారు దీంతో  ఈ మ్యాచ్ లో భాగమైన ఆటగాళ్లకు మంత్రి వ్యాఖ్యలపై  తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: