ఒక్క బౌన్సర్ ఆడలేదు.. 8 వేల పరుగులు చేశాడు.. అదే అతని నిబద్ధత.?

praveen
భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఒక ప్రత్యేకమైన స్థానం వుంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు మైదానంలో దూకుడుగా ఆడుతూ ప్రేక్షకులందరినీ తన ఆటతో కను రెప్ప వాల్చకుండా చేసేవాడు వీరేంద్ర సెహ్వాగ్. తనదైన బ్యాటింగ్ తో  మ్యాచ్ స్వరూపాన్ని నిమిషాల్లో మార్చగల సత్తా వీరేంద్ర సెవాగ్ సొంతం. ఎంతో సొగసైన షాట్లు కొడుతూ మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగించేవాడు వీరేంద్ర సెహ్వాగ్ . అయితే తాజాగా మాజీ బ్యాట్స్మెన్ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా  వీరేంద్ర సేవ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  ఒక గొప్ప నిజాయితీపరుడు అని... ఆయన ప్రశంసలు కురిపించారు.



 ఇటీవలే గౌరకపూర్ అనే వ్యాఖ్యతతో 22 యార్డ్స్  పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్   తాను ఏం చేయగలడో... ఏం చేయలేడో  అనే విషయంలో ఎంతో స్పష్టత కలిగి ఉంటాడు అంటూ చెప్పారు ఆకాష్ చోప్రా. అయితే టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... తన కెరీర్లో ఒక్క బౌన్సర్ బంతిని కూడా ఆడలేదు అంటే తన నిబద్ధత క్రమశిక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆకాష్  చోప్రా  చెప్పుకొచ్చారు.




 మేమిద్దరం కలిసి మైదానంలో ఆడుతున్న సమయంలో సెహ్వాగ్  ఎన్నో విషయాలను తనతో పంచుకునే వాడని... ఒకవేళ మైదానంలో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతున్న సమయంలో తాను షాట్లు ఆడలేను అనే విషయాన్ని కూడా సెహ్వాగ్ తనతో చెప్పుకునే వాడు అంటూ  తెలిపాడు ఆకాష్ చోప్రా. కానీ ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు మాత్రం బంతిని చితక్కొట్టే వాడు అంటూ తెలిపారు ఆకాష్ చోప్రా. అంతేకాకుండా ఒకసారి మైదానంలో సెట్ అయిన తర్వాత తరచూ అవుట్ అయితే జట్టులో నుంచి తీసేస్తారు అంటూ  తనకు సెహ్వాగ్ సలహాలు కూడా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు ఆకాష్ చోప్రా. కాగా ఆకాష్ చోప్రా  కేవలం భారత్ 10 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడగా... పేలవ ప్రదర్శనతో అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ అవకాశం వచ్చినా అక్కడ తన సత్తా చాటలేకపోవడంతో  అక్కడ అవకాశాలు కరువయ్యాయి.దీంతో  వ్యాఖ్యాతగా అవతారమెత్తాడు ఆకాష్  చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: