ధోనీకే కాదు.. జెర్సీ నెం..7 కి కూడా రిటైర్ మెంట్..?

praveen
ఇటీవలె టీమిండియా మాజీ సారథి దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ  క్రికెట్ ఆటకు వీడ్కోలు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధోని ఐపీఎల్ లో రాణించి మళ్లీ జట్టులోకి వస్తాడు అని ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ధోని రిటైర్మెంట్ బిగ్ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇక ధోనీ రిటైర్మెంట్ పై అభిమానులు అందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు. కాగా ఆగస్టు 15న సాయంత్రం సమయంలో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమ అభిమాన ఆటగాడైన మహేంద్రసింగ్ ధోని మరోసారి టీమిండియా జెర్సీ లో  చూడలేము అన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ధోని రిటైర్మెంట్ పై ఇప్పటికే ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా రంగాల ప్రముఖులు స్పందిస్తూ భారత క్రికెట్ చరిత్రలో ధోని చేసిన సేవలను కొనియాడిన  విషయం తెలిసిందే,



 అయితే మామూలుగా భారత క్రికెట్లో ధోని అనగానే 7 నెంబర్ జెర్సీ గుర్తు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ధోని లక్కీ నెంబర్ సెవెన్ కాబట్టి  సెవెన్ అనే నెంబర్ జెర్సీ  చూడగానే.. క్రికెట్ ప్రేక్షకులందరికీ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకు వస్తాడు, అయితే మామూలుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అదే నెంబర్ గల జెర్సీని వేరొక ఆటగాడు ధరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో బిసిసిఐకి టీమిండియా ఆటగాడు  దినేష్ కార్తీక్ ఒక సరికొత్త డిమాండ్ ను  తెరపైకి తెచ్చాడు. టీమిండియాలో ధోనీ జెర్సీ నెంబర్ 7 ను  ఎంతో  గౌరవించిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 అంతర్జాతీయ క్రికెట్ కు  మహేంద్రసింగ్ ధోని గుడ్ బాయ్ చెప్పడంతో... ధోని 7 నెంబర్ జెర్సీ కి  కూడా వీడ్కోలు పలకాలని బీసీసీఐ కి డిమాండ్ చేశాడు  ఆటగాడు దినేష్ కార్తీక్. మహేంద్ర సింగ్ ధోనీ గౌరవార్థం టీమిండియా ఆటగాళ్లు ఎవరు కూడా ధోని 7 నెంబర్ జర్సీ   ధరించకుండా చూడాలని బీసీసీఐని కోరాడు. కాగా  ధోని బర్త్ డే ఏడో నెల 7వ తారీకు... ధోని ఎప్పటినుంచో ఏడు నెంబర్ను సెంటిమెంట్ గా ఫాలో అవుతూ వస్తున్నాడు. అయితే అటు అభిమానులు కూడా ధోని 7 నెంబర్ జెర్సీ ని  ఎంతగానో గౌరవిస్తారు.  అభిమానులు కూడా ఈ జెర్సీ వేరే ఆటగాళ్లకు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: