టీమిండియాలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసేది అతనొక్కడే..?
ధోతి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే దానిపై ప్రస్తుతం రిషబ్ పంత్ కె.ఎల్.రాహుల్ పేర్లు తెర మీద చర్చకు వస్తున్నాయి. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, తొలుత సాహా పేరు ప్రస్తావించిన చోప్రా అతడు కేవలం టెస్టుల వరకు మాత్రమే పనికొస్తాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల విషయానికి వస్తే... రిషబ్ పంత్ ధోని స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపిన ఆకాష్ చోప్రా... రాహుల్ కి కూడా అవకాశం ఉన్నప్పటికీ 50 ఓవర్లు కీపింగ్ చేసి ఆ తర్వాత ఓపెనర్ గా రావడం అనేది కష్టతరం అయినది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే రాహుల్ కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాశ్ చోప్రా.
ప్రస్తుతం టీమిండియా కీపింగ్ కోసం పంత్ కే తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆ తర్వాత కూడా టీమిండియా జట్టులో కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం శాంసన్, ఇషాన్ లకు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ ఎవరు అంటూ నెటిజన్ ప్రశ్నించగా... ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా.