ఢిల్లీ కాపిటల్స్ కి దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు మరో షాక్..?
అయితే నిన్న సన్ రైజర్స్ విజయంలో బ్యాట్ మెన్ల పాత్ర ఎంత కీలకంగా ఉందో... బౌలర్ల పాత్ర అంతకుమించి కీలకం గా మారిపోయింది అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు ఫుల్ ఫామ్ లోకి వచ్చి.. ఢిల్లీ కాపిటల్స్ బ్యాట్ మెన్లను తెగ ఇబ్బందులకు గురిచేశారు. ప్రతి ఓవర్లో కూడా పరుగులకు కట్టడి చేస్తూ.. చివరికి విజయం దిశగా మ్యాచ్ను తీసుకెళ్లారు. అయితే సన్ రైజర్స్ జట్టు విజయం అందుకని పాయింట్ల పట్టికలో కూడా పైకి ఎగబాకిన విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి మరో షాక్ తగిలింది.
నిన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రేయస్ అయ్యర్ భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఏకంగా శ్రేయస్ అయ్యర్ కి పన్నెండు లక్షల జరిమానా విధించింది యాజమాన్యం. నిన్న జరిగిన మ్యాచ్లో పిచ్ నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో బౌలర్లను మార్చేందుకు తరచూ చర్చలు జరిపాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఈ క్రమంలోనే నిర్ణీత సమయం ప్రకారం కాకుండా స్లో ఓవర్ రేట్ నమోదయ్యింది. ఇక నిర్ణీత సమయంలో ఓవర్ల కోటను పూర్తి చేయలేక పోవడంతో ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై 12 లక్షల జరిమానా పడింది. అంతకుముందు బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 12 లక్షలు జరిమానా చెల్లించిన విషయం తెలిసిందే.