11 కోట్లకు కొంటే.. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు..?

praveen
ఐపీఎల్ లో మొదటి నుంచి తీవ్రస్థాయిలో పేలవ ప్రదర్శన చేసి వరుస పరాజయాలను మూటగట్టుకుని  ఎన్నో రోజుల పాటు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు క్రమక్రమంగా పుంజుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆడిన ప్రతీ మ్యాచ్ కూడా గెలవాల్సి  ఉన్న తరుణంలో ప్రస్తుతం ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తమ ప్రతిభతో చిత్తు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నది . ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోరు నమోదు చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా కూడా కె.ఎల్.రాహుల్ కొనసాగుతూ ఉండటం గమనార్హం.

 అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో మాక్స్ వెల్ బాగా రాణిస్తాడని ఎన్నో అంచనాల మధ్య జట్టులోకి తీసుకున్నారు. ఈ సీనియర్ ఆల్ రౌండర్ మాత్రం అంతగా రాణించలేక పోతూ ఉండడంతో ప్రస్తుతం విమర్శలకు దారితీస్తోంది. ఎంతో అనుభవం ఉన్న మ్యాక్స్వెల్ లాంటి ఆటగాడు ప్రస్తుతం రాణించ కుండా కనీసం ఒక్కసారి కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే జట్టు యాజమాన్యం ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ ను దాదాపుగా 11 కోట్ల పారితోషికం చెల్లించి కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించి అద్భుతంగా రాణిస్తాడు అని అనుకుంది.


 కానీ యాజమాన్యం అంచనాలు అన్నీ పూర్తిగా తారుమారు అయిపోయాయి. బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా రాణించలేక మాక్స్వెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేదు మ్యాక్స్వెల్. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచుల్లో కేవలం 102 రన్స్ మాత్రమే చేసి అందర్నీ నిరాశపరిచాడు. అంతే కాదు మొత్తం 10 మ్యాచుల్లో కలిపి 100 బంతులను మాత్రమే ఎదుర్కున్నాడు మ్యాక్స్వెల్. ఈ  గణాంకాలను బట్టి చూస్తే మ్యాక్స్ వెల్ ఎంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు అన్నది అర్ధమవుతుంది. 10 మ్యాచ్ లలో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: