కీలక పోరు.. ఓడితే ఇంటికే పోతారు..?
అయితే నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్కత నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగేందుకు అంతా సిద్ధమైంది అనే విషయం తెలిసిందే. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో తప్పక విజయం సాధించాలి అని రెండు జట్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒకవేళ నేడు జరగబోయే మ్యాచ్లో పంజాబ్ ఓటమి చవిచూసింది అంటే లీగ్ దశలోనే వెనుదిరగాల్సి ఉంటుంది. ఇక మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో రానా సునీల్ నరైన్ లాంటి ఆటగాళ్లు ఫామ్లోకి రావడం మరింత కలిసొచ్చే అవకాశం కూడా ఉంది.
అయితే కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మొదట ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రస్థానాన్ని కొనసాగించి వరుస ఓటములు చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు... ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఇటీవలే జరిగిన మ్యాచ్ లో మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య ఏది గెలవబోతున్న అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు చూసేందుకు అటు ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు.