ఐపీఎల్ : ఢిల్లీ ప్లే ఆఫ్ కి వెళ్లడం కష్టమే..?

praveen
ఐపీఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న జట్లు  ప్రస్తుతం ప్లే ఆప్ ఆశలను సజీవంగా ఉంచుకుంటు  హోరాహోరీగా పోరాడి  మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వరుస విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగిన జట్లను సైతం ఓడిస్తున్నాయి  పాయింట్ల పట్టికలో చివరన ఉన్న జట్లు. దీంతో గతంలో కంటే ఇపుడు మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది ఐపీఎల్  పోరు. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

 అయితే మొన్నటి వరకు వరుస విజయాలతో సత్తా చాటి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత కొంత కాలం నుంచి మాత్రం వరుస ఓటములు మూటగట్టుకున్న విషయం తెలిసిందే  దీంతో అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ప్లే ఆప్ కి అర్హత సాధిస్తుంది  అని  అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ వరుస ఓటములు అభిమానులందరినీ కలవరపెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ ఇలాగే ఓడిపోతే ఏం జరుగుతుంది అన్నది కూడా అభిమానులందరికీ ఊహకందని విధంగా ఉంది.

 అయితే ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓటమి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీలంక మాజీ ఆటగాడు సంగక్కర. ఢిల్లీ కాపిటల్ జుట్టు రానున్న మ్యాచ్లో కూడా ఇలాగే పేలవ  ప్రదర్శన చేసి ఓటమి చవి చూస్తే  ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్ కి చేయడం చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్లో నిలకడ కనిపించడంలేదని రానున్న మ్యాచ్లో బాగా రాణిస్తే ప్లే ఆప్ కి అవకాశాలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.  ఇప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించగా.. బెంగళూరు పంజాబ్ జట్లకు కూడా ప్లే ఆఫ్  అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు సంగక్కర. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఢిల్లీకి ప్లే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: