ఐపీఎల్ : ప్లే ఆప్ కి హైదరాబాద్.. ఇంటికి కోల్కత్తా..?
ముఖ్యంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు గెలవాల్సిన ప్రతి మ్యాచ్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకొచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇలా అన్ని జట్లను వెనక్కి నెట్టి ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ప్లే ఆప్ కి క్వాలిఫై అయింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి . ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకుపోతూ... ఐపీఎల్ 2020 సీజన్ లో ప్లే ఆప్ కి అర్హత సాధించిన మొదటి రికార్డు సృష్టించిన... ముంబై ఇండియన్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి గెలుస్తుందా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
కానీ ఎవరూ ఊహించని విధంగా... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ సీజన్ లో దిగ్గజ జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ జట్టు కు బ్రేకులు వేసి... అన్ని విభాగాల్లో ఆధిపత్యం సాధించి మెరుగైన ప్రదర్శన చేసి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు... ప్లే ఆప్ కి అర్హత సాధించింది. కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని అందుకోవడం అభిమానులందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ప్లే ఆఫ్ కి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫై అవడం చివరికి కోల్కతా నైట్రైడర్స్ ఇంటిదారి పట్టింది.