ఐపీఎల్ : విరాట్ కోహ్లీ బావోద్వేగం.. పోస్ట్ వైరల్..?

praveen
ఐపీఎల్ సీజన్ లో మళ్లీ అదే జరిగింది... ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ప్రతిభ కల ఆటగాళ్లను కలిగి ఉన్న జట్టుగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ప్లే ఆఫ్ చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతూ వచ్చింది. ప్రతిసారీ కూడా నిరాశపరుస్తూ వచ్చింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించింది కేవలం రెండుసార్లు మాత్రమే అంటే అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ లో ఎంతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విఫలం అవుతుంది అన్నది.



 భారత కెప్టెన్గా ఎంతో విజయవంతమైన విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా మాత్రం ఎందుకో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉన్నాడు. ఇక నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి చవిచూసి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది అనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించింది. ఈ సారైనా కప్పు గెలిస్తే చూడాలని ఉంది అని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులందరికీ మరోసారి నిరాశే ఎదురైంది.



 ఇక ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం భావోద్వేగంతో ఓ సందేశం పంపాడు. ఆర్సిబి టీమ్ మొత్తం కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. జట్టుని  చూస్తే తనకు గర్వంగా ఉంది వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తాము అని మాట ఇచ్చాడు విరాట్  కోహ్లీ . ఓ జట్టుగా మనకు ఇదో గొప్ప ప్రయాణం.. ఏడాది మనకు కలిసి రాలేదు కానీ జట్టును చూస్తే గర్వం గానే ఉంది. మద్దతు ఇచ్చినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ మమ్మల్ని ఇంకా బలం గా మారుస్తుంది. త్వరలోనే కలుద్దాం అంటూ విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: