హైదరాబాద్ పై మరోసారి ప్రేమ చూపించిన డేవిడ్ భాయ్..!

praveen
ఏడాది ఐపీఎల్లో టైటిల్ ఫేవరెట్గా రంగంలో కి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించింది.  అయినప్పటికీ ఈ ఏడాది ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తప్పక టైటిల్ గెలుస్తుందని అభిమానులు అందరూ ఎంతో నమ్మకం తో ఉన్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట లీగ్ దశలో కాస్త పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించిప్పటికీ లీగ్  దశ ముగింపు లో మాత్రం ప్లే ఆప్ కి అర్హత సాధించేందుకు వరుస  ఘన విజయాల ను సాధించకుంటు  దూసు కొచ్చింది అన్న విషయం తెలిసిందే.



 లీగ్ దశలో చివరి మ్యాచ్లో ఘన విజయా న్ని సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్లే ఆప్ కి చేరుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై  అద్భుతం గా రాణించడం తో... ఎంతో సునాయాసం గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే క్వాలిఫైయర్ 2 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  తో సన్ రైజర్స్ జట్టు మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్లో విజయం కోసం సన్రైజర్స్ జట్టు ఎంతగానో పోరాడింది అని చెప్పాలి



 చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్రైజర్స్ జట్టులో ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది. అయితే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టుపై  తెలుగు ప్రేక్షకుల పై తనకున్న ప్రేమను అభిమానాన్ని మరోసారి చూపించాడు.  హైదరాబాద్ నా కుటుంబం లాంటిది ఇది నా సెకండ్  హోమ్  ఇక్కడి ప్రాంతాన్ని ప్రజలను నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాను..  సాహా, భువనేశ్వర్ లాంటి కీలక ప్లేయర్స్  లేకపోయినప్పటికీ సన్రైజర్స్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు దానికి నేను ఎంతో గర్వ పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: