నా గాయంపై ఇంత రాద్ధాంతమా.. రోహిత్ కీలక వ్యాఖ్యలు..?

praveen
ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన సారథ్యంతో  ఎంతో  ప్రశంసలు అందుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే.  ఐపీఎల్ లో భాగంగా ఒక మ్యాచ్లో గాయం బారినపడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఐపీఎల్ లో రెండు మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక అదే సమయంలో బిసిసిఐ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టును ప్రకటించడం ఆ జట్టులో రోహిత్ శర్మ పేరు లేకపోవడం... రోహిత్ శర్మ గాయం బారినపడటం కారణంగానే తాము రోహిత్ శర్మను  ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్ట్ చేయలేదు అని బిసిసిఐ వివరణ ఇవ్వడం కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.

 ఐపీఎల్ లో ఎంచక్కా మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ నూ.. గాయం పేరుతో బిసిసిఐ సెలెక్ట్ చేయకపోవడం దారుణం అంటూ అభిమానులు బిసిసిఐ ని  ఈ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరోవైపు మాజీ లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మెత్తబడిన బిసిసిఐ టెస్ట్ సిరీస్ల కోసం రోహిత్ శర్మను ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ రోహిత్ శర్మ గాయంపై మాత్రం ప్రస్తుతం చర్చ ఆగడం లేదు. గత కొంతకాలంగా భారత్ క్రికెట్ గురించి చర్చ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రోహిత్ శర్మ గాయం వరకు వస్తుంది. ఇక రోహిత్ శర్మ గాయం కాస్త ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒక వివాదం లా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మ గాయంపై స్పందించడం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై స్వయంగా రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన గాయం చుట్టూ ఎందుకు ఇంత రాద్దాంతం జరుగుతుంది అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. తన గాయం గురించి ఎప్పటికప్పుడు బిసిసిఐకి ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి సమాచారం ఇస్తూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తన గాయం చిన్నదే అని  ప్రస్తుతం కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చిన రోహిత్  శర్మ  వన్డే,  టి20 లకు తక్కువ సమయం ఉండటంతో ఆ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని... టెస్ట్ సిరీస్ కల్లా  పూర్తిగా కోలుకుని అందుబాటు లోకి వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: