టీమిండియా పూర్తిగా విఫలం అయింది.. హర్భజన్ కీలక వ్యాఖ్యలు..?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో ఆడేందుకు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ కూడా చేసింది. ఇక నిన్న ఆస్ట్రేలియాతో మొదటి వన్డే సిరీస్ ప్రారంభించింది భారత జట్టు. ఇక మొదటి మ్యాచ్లో అదరగొడుతుందని  భారత ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే పేలవ ప్రదర్శనతో భారత జట్టు తీవ్ర నిరాశ పరిచింది అనే విషయం తెలిసిందే. మొదట కనీస  ప్రదర్శన చేయలేక.. కనీస పోటీ ఇవ్వలేక చివరికి ఓటమి చవిచూసింది. దీంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అద్భుత ప్రదర్శన ను చూసేందుకు ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.



 నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అన్ని విభాగాలలో కూడా టీమిండియా విఫలం అయింది అనే చెప్పాలి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 377 పరుగులు చేసింది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయం సాధించలేకపోయారు అని చెప్పాలి. స్పిన్  బౌలింగ్ స్పీడ్ బౌలింగ్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్ లో భారీగా సిక్సర్లు బాదారు ఆస్ట్రేలియా బ్యాట్మెన్స్ . ఫీలింగ్ లో కూడా భారత జట్టు పూర్తిగా విఫలం అయింది అనే చెప్పాలి. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఎంతగానో విఫలమైంది. అయితే తాజాగా నిన్న వన్డే మ్యాచ్ ఓటమి పై స్పందించిన భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఫీల్డింగ్ విభాగంలో తేలిపోవడం కారణంగానే ఓటమి చవిచూడాల్సినా పరిస్థితి ఏర్పడింది అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారుతుందని నిన్న ఫీల్డింగ్ లో కొన్ని క్యాచ్ లు  భారత ఆటగాళ్లు మిస్ చేయడం కారణంగానే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్  భారీ స్కోర్లు చేయగలిగారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత భారీ స్కోరు చేసింగ్  టీమిండియాకు ఎంతో కష్టతరంగా మారింది అందుకే ఓటమి చవిచూసింది అని తెలిపాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: