ధోని ఉండుంటేనా.. ఫలితం మరోలా ఉండేది..?
ఇక టీమిండియాలో దిగ్గజ ప్లేయర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా పరిస్థితి అంతేనా అంటూ మరికొంతమంది కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయం కూడా తెర మీదికి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే విషయం పై ఇటీవలే వెస్టిండీస్ క్రికెటర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా కు ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారీ లక్ష్య ఛేదనలో మాత్రం టీమిండియా బ్యాట్స్మెన్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ మాజీ బౌలర్ మైకెల్ హోల్డింగ్. జట్టులో ధోని అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న ఛేదన చేయాలంటే కష్టంగా మారుతోందని.. ధోని ఉంటే ఎంత ఒత్తిడిలో అయినా ఛేదనను నియంత్రణలోకి తీసుకు వస్తాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందుకే భారత జట్టులోని ధోని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను సాధించింది అంటూ గుర్తు చేశాడు.