భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

praveen
కరోనా  వైరస్ కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు వివిధ క్రీడలను చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందే ప్రేక్షకులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా క్రికెట్ క్రీడ పూర్తిగా నిలిచి పోవడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసారు  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం కఠిన నిబంధనల మధ్య క్రికెట్ క్రీడ ప్రారంభమై ప్రస్తుతం అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. కానీ మరో నిరాశ ఏమిటి అంటే స్టేడియం లకు మాత్రం ప్రేక్షకులను ఎక్కువ మొత్తంలో అనుమతించక పోవడం గమనార్హం.



 ఈ క్రమంలోనే స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ను డైరెక్ట్ గా వీక్షించాలని ప్రేక్షకుల కోరిక ఎప్పుడు తీరుతుందో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. స్టేడియం లకు ప్రేక్షకులను అనుమతించని  నేపథ్యంలో ప్రస్తుతం కేవలం టీవీ లో మాత్రమే క్రికెట్ మ్యాచ్లు వీక్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు ఇలాంటి క్రమంలో ప్రస్తుతం అందరికీ శుభ వార్త అందింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 8వ తేదీన జరిగే మూడో టి20 కు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు.




 ఎందుకంటే స్టేడియంలోకి ప్రేక్షకులు అనుమతించడం పై ఐసీసీ విధించిన ఆంక్షలు ఈ నెల 7 తొలగిపోనున్న  నేపథ్యంలో ఈనెల 8వ తేదీన జరిగే భారత్ ఆస్ట్రేలియా మూడో టి20 కి పూర్తిస్థాయిలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ కి పూర్తిస్థాయిలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే శుభవార్త అదే చెప్పాలి. ఇన్ని  రోజుల వరకు కేవలం టీవీ లలో మాత్రమే మ్యాచ్ వీక్షించిన క్రికెట్ ప్రేక్షకులకు ఇప్పుడు స్వయంగా స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించే అవకాశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: