భారత్ ఆసీస్ టి20... ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో వరుసగా వన్డే టి20 టెస్ట్ సిరీస్ లు  ఆడుతుంది అనే విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ జట్టును మరింత బలహీనంగా మారుస్తున్నాయి. జట్టులోని కీలక ఆటగాళ్లందరూ గాయాల బారిన పడుతూ దూరం అవుతూ ఉండడం జట్టును ఎంతగానో వేధిస్తోంది.  జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల వల్ల టి20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. కుటుంబ కారణాల వల్ల మిచేల్  స్టార్క్  తప్పుకున్నాడు అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ లాంగర్ తెలిపాడు





 ఇదిలా ఉంటే నేడు జరగబోయే టీ20 మ్యాచ్ లో ఆరోన్ ఫించ్ ఆడటం కూడా ప్రస్తుతం అనుమానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పక్కటెముకల గాయంతో బాధపడుతున్న అతడు నేడు జరగబోయే టీ-20లో ఆడకపో వచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు సారథ్య బాధ్యతలను స్మిత్ కి  అప్పగించే అవకాశం ఉంది. కాగా రెండు సంవత్సరాల తర్వాత మరోసారి స్టీవ్ స్మిత్ ఆసీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. కేవలం ఎప్పుడు మాత్రమే కాదు ఆరంభం నుంచి ఆస్ట్రేలియా జట్టును వరుసగా గాయాల బెడద వేధిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే



 ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కండరాల నొప్పి కారణంగా మైదానం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయాడు.  ఆ తర్వాత ఆస్టన్ అగర్ ఆల్ రౌండర్ మార్క్ స్టోయినిస్  కూడా గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఈ గాయాల బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నట్లు సమాచారం. అదే సమయంలో కుటుంబ కారణాల వల్ల కూడా మిచేల్  స్టార్క్  దూరం అవడం ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: