ధోని,కోహ్లీ తర్వాత భారత సూపర్ స్టార్ అయ్యేది అతడే..?

praveen
ప్రస్తుతం భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు జట్టులో ఒక మంచి ఆల్ రౌండర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన ఆటగాడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే అయితే టీమిండియా జట్టు ఎన్నో రోజుల నుంచి మిడిలార్డర్ సమస్యతో బాధపడుతోంది ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో టీమిండియాకు మిడిలార్డర్ సమస్య తీరిపోయే  అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నాడు.



 భారత మాజీ లతోపాటు ఆస్ట్రేలియా మాజీ లు సైతం ప్రస్తుతం హార్థిక్ పాండ్యా  పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా క్రీజులోకి వచ్చి  మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న హార్థిక్ పాండ్యా  అద్భుతంగా ఎంతో సులభంగా జట్టుకు విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఇక ఇటీవల ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ హార్థిక్ పాండ్యా ఆటతీరుపై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ తర్వాత హార్థిక్ పాండ్యా సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రశంసించాడు.


 ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఎంతో సునాయాసంగా జట్టును గెలిపించాడు హార్థిక్ పాండ్యా.  ఈ క్రమంలోనే స్పందించిన మైకెల్ వాన్ భారత్ లో వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ జరుగుతుంది.. ప్రతి ఏటా ఐపీఎల్ కూడా నిర్వహిస్తారు..  ఈ క్రమంలోనే ఇదే ఫామ్ కొనసాగిస్తే హార్థిక్ పాండ్యా సూపర్ స్టార్ గా అవతరించెందుకు అవకాశం ఉంటుంది.. ధోనీ సుదీర్ఘకాలం ఆ హోదా ని అనుభవించాడు ఇప్పుడు కోహ్లీ ఆ స్థాయిలో ఉన్నాడు తర్వాత భారత్ తరఫున సూపర్ స్టార్ కాబోయేది హార్దిక్ పాండ్యా అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: