అవసరం లేకున్నా కోహ్లీ మళ్లీ అదే చేస్తాడు.. సెటైర్ వేసిన సెహ్వాగ్..?

praveen
ఇటీవలే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేసి... మనీష్ పాండే సంజు  శాంసన్  లకు జట్టులో స్థానం కల్పించడం పై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ  కెప్టెన్సీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్న విషయం తెలిసిందే సాధారణంగానే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసే వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా జట్టులో ఆటగాళ్ళ అందరికీ రూల్స్ వర్తిస్తాయి కానీ విరాట్ కోహ్లీకి  మాత్రం వర్తించవా అంటూ ప్రశ్నించాడు.అసలు శ్రేయస్ అయ్యర్ పైన వేటు వేయాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించాడు వీరేంద్ర సెహ్వాగ్.

 దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరగనున్న నామమాత్రము  మూడవ టి-20 మ్యాచ్  గురించి వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇప్పటికీ 2 టి20 మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ ని దక్కించుకున్న టీమిండియా మూడవ సిరీస్లో ఓడిన గెలిచిన పోయేదేమీ ఉండదు... దీంతో భారత తుది జట్టు లో మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.

 కానీ ప్రతి మ్యాచ్ లో  కూడా జట్టులో మార్పులు చేయడం కోహ్లీ కి  అలవాటు కాబట్టి ఇక మూడవ టి20 మ్యాచ్ లో కూడా మార్పులు చేస్తాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్ వేసాడు..  గాయం కారణంగా జట్టుకు  దూరమైన మనీష్ పాండే కి  చివరి టి20లోఆడే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక సంజు  శాంసన్ దూకుడుగా కనిపించినప్పటికీ పరుగులు చేయలేకపోయారని.. సంజు  శాంసన్ స్థానంలో మనిష్  పాండే కి  చోటు  దక్కే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  గత మ్యాచ్లో సరిగా ఆడ  లేకపోయినా మనీష్ పాండే కి  విరాట్ కోహ్లీ మంచి అవకాశం కల్పిస్తాడు అంటు  అభిప్రాయం వ్యక్తం చేసాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: