ధోని సూచనలు భారత జట్టు మిస్ అవుతుంది.. అందుకే అలా జరిగింది..?

praveen
ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా భారత క్రికెట్ కు ధోని చేసిన సేవలను ఎంతో మంది క్రికెటర్లు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వికెట్ల వెనకాలే ఉండే ధోని  మొత్తం మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసే తీరును ఇప్పటికి కూడా గుర్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ధోనీ వికెట్ల  వెనకాల ఉండి పదునైన వ్యూహాలకు పని చెప్పడంతో  పాటు బౌలర్లకు ఎప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ బాల్ లెంత్ లో వేస్తే  వికెట్ పడుతుంది అన్నది కూడా సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 కానీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక గొప్ప బ్యాట్స్మెన్ అయినప్పటికీ వికెట్ల వెనకాల ఉండి బౌలర్ ల  కు సలహాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఎంతో మంది బౌలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా స్పిన్ బౌలర్లు అయితే ఏ లెన్త్ లో  బాల్ వేయడం ద్వారా బ్యాట్ మెన్ నూ ఔట్  చేయవచ్చు అనేది తెలియక అటు వికెట్ కీపర్ బౌలర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఇక బౌలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఈ మధ్యకాలంలో. తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 టీమిండియా ప్రస్తుతం ధోని సూచనలు సలహాలను ఎంతగానో మిస్ అవుతుంది అంటూ మాజీ క్రికెటర్ కిరణ్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ చాహల్ లు  ఇప్పుడు విఫలం కావడానికి కారణం కూడా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. వికెట్ల వెనుక ఉండే మహేంద్రసింగ్ ధోని బౌలర్లకు ఏ లెన్త్ ఆఫ్ లైన్ లో బాల్ వేయాలి అనే విషయాన్ని బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉండేవాడని తద్వారా ఎంతో విజయవంతం అయ్యే వారు అంటూ చెప్పుకొచ్చాడు.  అందుకే ప్రస్తుతం ఎన్నో జట్లు తమ జట్టుకు కెప్టెన్గా వికెట్ కీపర్ ను పెట్టుకున్నాయి అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: