కోహ్లీ సేనను అతడు మాటలతో ఢీ కొడతాడు.. మహమ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్..?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుతో వన్డే టి20 సిరీస్ లు  ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టీ20 సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. అయితే అంతకుముందు ఆడిన వన్డే సిరీస్లో మాత్రం వరుసగా పరాజయాలు చవి చూసి సిరీస్ చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే టి20 సిరీస్ పూర్తి చేసుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో ఇరుజట్లు ఎలా ఆడబోతున్నాయి  అనే దానిపై ఆసక్తి నెలకొంది.



 అయితే ఇప్పటికే ఇరు జట్లు చెరో ఒక సిరీస్ కైవసం చేసుకున్నాయి ఇక టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న జట్టు ఆధిపత్యం సాధించినట్లు అవుతుంది. ఈ క్రమంలోనే ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక డిసెంబర్ 17 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో మాటల యుద్ధం ఉండే అవకాశం ఉంది అని ఎంతో మంది ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆడబోయే టెస్ట్ సిరీస్లో స్లెడ్జింగ్ పై ఇటీవల స్పందించిన భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ ల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ కెప్టెన్ టీమ్  ఫైన్ తప్పకుండా స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ కైఫ్. ఫించ్, స్మిత్, డేవిడ్ వార్నర్ లు ఐపీఎల్ లో ఆడారు కాబట్టి సంయమనం గా ఉండే అవకాశం ఉందని..  కానీ కెప్టెన్ టీమ్ ఫైన్ మాత్రం స్లెడ్జింగ్ కి  దిగే అవకాశం ఉంది అంటూ మహమ్మద్ టైప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: