ఇండియా, ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టు నుంచి జడేజా, పంత్ ఔట్...
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గురువారం రోజున ఆసీస్ జట్టుతో అడిలైడ్ వేదికగా జరగబోతున్న తొలి టెస్టుకి టీమిండియా మేనేజ్‌మెంట్ ఫైనల్ జట్టుని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలకి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పక్కన పెట్టేసింది. అతనికి బదులుగా సాహాకి కీపర్‌గా అవకాశమివ్వడం జరిగింది. ఇక మిడిలార్డర్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు..ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో చూసుకున్నట్లయితే ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలకి అవకాశం లభించింది.
స్పిన్నర్ కోటాలో రవీంద్ర జడేజాని పక్కన పెట్టేసింది మానేజ్మెంట్. అతనికి బదులుగా అశ్విన్‌కి అవకాశం ఇచ్చింది.. హనుమ విహారి పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా. డే/ నైట్ టెస్టు రూపంలో గులాబి బంతితో ఈ మ్యాచ్ జరగబోతుంది.విరాట్ కోహ్లీ తనకెంతో ఇష్టమైన ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లు (కీపర్‌తో కలిపి), నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తోనే తొలి టెస్టులో బరిలోకి దిగబోతున్నట్లు తేలిపోయింది.
వాస్తవానికి ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ బాదిన రిషబ్ పంత్‌కి తొలి టెస్టులో ఛాన్స్ ఇస్తారని అంతా ఊహించారు. కానీ.. అతనికి నిరాశే ఎదురైంది. తొడ కండరాల గాయం నుంచి జడేజా ఇంకా పూర్తిగా కోలుకున్నట్లు లేదు. దాంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయడమే కాకుండా సెంచరీ బాదిన విహారికి తుది జట్టులో చోటు దక్కినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి భారత్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, హనుమ విహారి, వికెట్ కీపర్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులు ఆడబోతున్నారు..
రిజర్వ్ బెంచ్ గా శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర డేజా తదితరులు వున్నారు. ఇలాంటి మరెన్నో క్రీడా వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంక మరెన్నో విషయాలు తెలుసుకోండి...