నన్ను పోల్చినవసరం లేదు.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్..?

praveen
ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం విరాట్ కోహ్లీ ఆటతీరు కు మాత్రమే కాదు అతని దూకుడైన స్వభావానికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మైదానం వెలుపల ఎంతో ఫన్నీ గా నవ్వుతూ నవ్విస్తూ ఉండే విరాట్ కోహ్లీ ఒకసారి మైదానంలోకి దిగి  మ్యాచ్ మొదలుపెట్టాడు అంటే ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న తప్పు జరిగినా అగ్రెసివ్ గా స్పందిస్తూ ఎప్పుడూ విజయం కోసం తహ తహ లాడుతూ ఉంటాడు.  ఇక టీమిండియాకు విజయం అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.

 కేవలం ఒక సారథిగా మాత్రమే కాకుండా జట్టులో కీలక బ్యాట్స్మెన్గా ప్రతి సారి కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర వహిస్తారు.  అయితేసాధారణంగా ఏ ఆటగాడికి అయినా సరే ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఆటగాడు తమ మైండ్ సెట్ ప్రకారమే తమ గేమ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఒక ఆటగాడు మైండ్సెట్ ని  ఇతర ఆటగాళ్లు తో పోల్చి చూసినప్పుడు...  అలాంటి పోలికలను ఆటగాళ్లు అస్సలు ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇటీవల విరాట్ కోహ్లీ కూడా ఇదే చెప్పుకొచ్చాడు.

 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడైన ఆట తీరు  పోరాట పటిమను చూస్తుంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్ మైండ్ సెట్ లాగే ఉంది అంటూ గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారగా తాజాగా దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా వ్యక్తిత్వం ఒక సరికొత్త ఇండియా కు ప్రాతినిధ్యం వహిస్తుంది అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను.. నా వ్యక్తిత్వాన్ని ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ తో పోల్చల్సిన  అవసరంలేదు.. నా వ్యక్తిత్వం తొలి రోజు నుంచి ఇలాగే ఉంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది అంటూ విరాట్ కోహ్లీ బదులు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: