విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్.. ఔరా అంటున్న ఫాన్స్..?

praveen
సాధారణంగా విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్ గా  ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగే  విరాట్ కోహ్లీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అస్సలు సహించడు అన్న విషయం తెలిసిందే. అదే క్రమంలో అటు చిన్న తప్పు జరిగినా కూడా అగ్రెసివ్గా స్పందిస్తూ ఉంటాడు.  విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడైనా బ్యాటింగ్కు దిగాడు అంటే ఇక పరుగుల వరద పారిస్తూ  ఉంటాడు అనే విషయం తెలిసిందే.

 కెప్టెన్ గా ఒక వైపు జట్టును  ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళుతూనే  మరోవైపు ఇక జట్టును విజయతీరాలకు చేర్చడం కోసం బ్యాట్  కి పని చెప్పి పరుగుల వరద పారిస్తూ  ఉంటాడు విరాట్ కోహ్లీ. కేవలం బ్యాటింగ్ విషయంలోనే కాదు విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ విషయంలో కూడాఎంతో అద్భుతమైన ఫీల్డింగ్  చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన రీతిలో డైవ్  చేస్తూ క్యాచ్  అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 మ్యాచ్ జరుగుతున్న సమయంలో 41 ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో.. బ్యాటింగ్ చేస్తున్న కామెరూన్ గ్రీన్  బంతిని మిడ్ వికెట్ దిశగా ఫుల్ చేసేందుకు ప్రయత్నించాడు.  బంతి సరిగా కనెక్ట్ కాలేదు దీంతో.. గాల్లోకి లేచింది.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కుడివైపునకు డైవ్  చేస్తూ బంతిని క్యాచ్ అందుకున్నాడు.  ఎంతో వేగంగా పక్కనుంచి దూసుకెళ్తున్న బంతిని విరాట్ కోహ్లీ మెరుపువేగంతో అందుకోవడం చూసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్టాన్నింగ్  క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడంతో ఇక ఎంతో మంది ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: