జస్ప్రిత్ బూమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆఖరి లో టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బూమ్రా నైట్ వాచ్మెన్ గా రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అనే విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా 244 పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. దీంతో 53 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం సమయంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా ఓపెనర్ పృద్వి షా కేవలం నాలుగు పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు... దీంతో ఆ తర్వాత విరాట్ కోహ్లీ నైట్ వాచ్మెన్ గా జస్ప్రిత్ బుమ్రా ను పంపించడంతో అందరూ అవాక్కయ్యారు.
టీమిండియా పేసర్ ఎలా ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. అయితే జస్ప్రిత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలివిగా ఆడాడు ఆట పూర్తయ్యేంతవరకు ఒక్క రన్ కూడా చేయకుండా వికెట్ కాపాడుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 9-1 తెలిసిందే. ఈ క్రమంలోనే జస్ప్రిత్ బూమ్రా మూడవస్థానంలో నైట్ వాచ్ మెన్ గా రావడం పై స్పందించిన భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ సరదాగా పలు వ్యాఖ్యలు చేశాడు. నలభై యాభై ఏళ్ల తర్వాత బూమ్రా తన మనవళ్లు మనవరాళ్లతో మాట్లాడుతూ.. తాను టీమిండియాలో మూడవ స్థానంలో ఆడాను అనే విషయాన్ని చెప్పుకుంటాడు అంటూ తెలిపాడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది అనేది మాత్రం దాచి పెడతాడు అని గవాస్కర్ సరదా వ్యాఖ్యలు చేశాడు.