మాటలు రావడం లేదు.. ఓటమిపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్..?
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బాగా రానిస్తే ఈ పరుగులు ఇది కష్టమేమీ కాదు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఆల్ ఔట్ కావడంతో ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. అయితే టీమిండియా జట్టులో ఆటగాళ్లు పలు కీలక క్యాచ్లు మిస్ చేసినప్పటికీటీ మిండియాకు విజయం మాత్రం ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఘోరంగా విఫలం అయింది. టెస్ట్ చరిత్రలోనే అతి చెత్త రికార్డును ఇటీవలే టీమిండియా మూటగట్టుకుంది. ఇండియాలో దిగ్గజ బ్యాట్ మెన్స్ సైతం సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడంతో అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా.
దీంతో ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఎంతో అలవోకగా ఇక లక్ష్యాన్ని చేదించడంతో పాటు ఆధిపత్యం సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓటమి చవి చూడక తప్పడంలేదు. అయితే ఇటీవలే టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో ఓటమి పాలు కావడం పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాటలు రావడం లేదు...మొదట ఆధిక్యంలో కొనసాగిన మేం ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాము. రెండు రోజులు శ్రమించి పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ కూడా.. గంటల వ్యవధిలోనే దారుణ స్థితికి వచ్చేసాము. మా బ్యాటింగ్ సరిగాలేదు ఆస్ట్రేలియా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.