ఆదాయంలో దుమ్ములేపిన బుమ్రా.. కోహ్లీ ని వెనక్కి నెట్టేశాడు..?

praveen
సాధారణంగా టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీ సంపాదనలో ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. కేవలం సంపాదన విషయం లో మాత్రమే కాదు  ఆట విషయంలో కూడా ఇతరులతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందు స్థానంలోనే ఉంటాడు.  అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా భారత కీలక ఆటగాడు  జస్ప్రిత్ బూమ్రా విరాట్ కోహ్లీనీ  వెనక్కి నెట్టి అత్యధికంగా ఆదాయం సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానం లోకి వచ్చేశాడు.

 ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా తన స్థానాన్ని ప్రస్తుతం భారత జట్టులో సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఎన్నోసార్లు కీలక సమయాల్లో భారత జట్టును విజయతీరాల వైపు నడిపించి  కీలక వికెట్లు పడగొట్టి కీలక ఆటగాడిగా మారిపోయాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక ప్రతి ఫార్మాట్ లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్న బుమ్రా  ఇక ఎంతో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు  అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సంపాదనలో జస్ప్రిత్ బూమ్రా ఏకంగా ఇండియాలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లను సైతం వెనక్కి నెట్టాడు అనే చెప్పాలి.

 ప్రస్తుత భారత జట్టులో స్టార్ బౌలర్  గా  కొనసాగుతున్న జస్ప్రిత్ బుమ్రా ఇక భారత్ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో ఎక్కువ అర్జీంచిన  ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1.38 కోట్లు సంపాదించాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 1.29 కోట్ల గా రెండో స్థానంలో ఉన్నాడు ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా 96 లక్షలతో.. రోహిత్ శర్మ 30 లక్షలతో వరుసగా బుమ్రా  తర్వాత ఉన్నారు. కాగా ప్రస్తుతం బీసీసీఐ  టెస్ట్ లకు 15 లక్షలు వన్డేలకు 6 లక్షలు.. టి20 లకు  మూడు లక్షలు పారితోషికం చెల్లిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: