భారత్ - ఆసిస్ టెస్ట్.. ప్రేక్షకులకు భారీ షాక్..?

praveen
కరోనా వైరస్ ప్రభావం కారణంగా అన్ని రకాల క్రీడలు పూర్తిగా నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు ఏడు నెలల పాటు ఆటగాళ్ళందరూ కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడు మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బిజీ బిజీగా ఉండే ఆటగాళ్లు కరోనా వైరస్ కారణంగా దీర్ఘకాలం పాటు కేవలం ఇంటికే పరిమితమయ్యారు.  ఈ క్రమంలోనే అన్ని దేశాలలో అన్లాక్ మార్గదర్శకాలు విడుదల అయిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్పటికీ కఠిన నిబంధనల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.


 ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఎక్కడా బయటికి వెళ్లకుండా బయో బబుల్ పద్ధతిలో మ్యాచ్ లు  నిర్వహిస్తున్నాయి  ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా అక్కడ మ్యాచులు జరుగుతున్నాయి.  అయితే ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ప్రభావం మూడవ టెస్ట్ మ్యాచ్ పై పడే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా టాక్ వినిపించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇది నిజమే అన్నది అర్థం అవుతుంది.



 భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జనవరి 7వ తేదీ నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది అన్న విషయం తెలిసిందే.  అయితే సిడ్నీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా భారత్ టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు కేవలం 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. గతంలో 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియంకు అనుమతించాలని నిర్వహించగా ఇప్పుడు మాత్రం కేవలం 25 శాతం మంది మాత్రమే అనుమతించేందుకు నిర్ణయించారు. అంటే మ్యాచ్ కేవలం 9500 మంది ప్రేక్షకులు మాత్రమే ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి రిఫండ్ చేసే ప్రక్రియను కూడా మొదలు పెట్టారు ఇది ప్రేక్షకులకు భారీ షాక్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: