ఆస్ట్రేలియా ఆశలు ఆవిరయ్యాయి.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ..?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో  టెస్ట్ సిరీస్ ఆడుతున్నది  అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే 2దిగ్గజ జట్లు  అయినా భారత్-ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎవరు విజయం సాధించి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంటారు అనేదానిపై ప్రస్తుతం ఎంతగానో ఆసక్తి నెలకొంది అనే చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు టెస్టు మ్యాచ్ లలో  మొదటి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. నేడు  ఉదయం నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే సిడ్ని  వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ కి  దిగింది.  ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసి డేవిడ్ వార్నర్ ను 51 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చడంలో విజయం సాధించాడు.  పుజారాకు క్యాచ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడి విఫలమవుతున్న నేపథ్యంలో వార్నర్ ఎంట్రీతో ఈ సమస్య తీరిపోతుంది అని అనుకున్నప్పటికీ వార్నర్  కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు.


 ఇక మరోవైపు రోహిత్ శర్మ భారత జట్టులోకి రావడంతో భారత జట్టు మరింత పటిష్టంగా మారిపోయింది అనే చెప్పాలి.  గాయపడిన ఉమేష్ యాదవ్ స్థానంలో నవదీప్ సైని జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

భారత్‌ (తుది జట్టు): రహానే (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ.
ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: