ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

praveen
అప్పట్లో భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో కీలక బౌలర్ గా  తక్కువ సమయంలోనే ఎదిగిన శ్రీశాంత్.. ఎప్పుడూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉండేవాడు.. భారత్ విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాడు.  ఇక తన బౌలింగ్ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్.  కానీ కెరియర్ పిక్స్ లో కొనసాగుతున్న తరుణంలోనే శ్రీశాంత్ చేసిన తప్పు అతన్ని పూర్తిగా క్రికెట్ కు దూరం చేసింది అన్న విషయం తెలిసిందే.



 ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కి  శ్రీశాంత్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం  విచారణలో ఇది నిరూపణ కావడంతో.. బీసీసీఐ శ్రీశాంత్ పై తీవ్రంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంది. శ్రీశాంత్ పై  జీవిత కాలం నిషేధం విధించగా శ్రీశాంత్ న్యాయ పోరాటం చేయడంతో ఏడేళ్ళ పాటు నిషేధం విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. శ్రీశాంత్ తన 7 ఏళ్ల నిషేధం పూర్తి చేసుకుని మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడు అన్న విషయం తెలిసిందే. మరోసారి భారత జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రస్తుతం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ జట్టు తరపున ఆడేందుకు శ్రీశాంత్ కి అవకాశం వచ్చింది. దీంతో మూడేళ్ల నిషేధం తర్వాత మొదటిసారి శ్రీశాంత్ క్రికెట్ మైదానంలోకి దిగాడు. ఇటీవల సోమవారం కేరళ జట్టు తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 7 ఏళ్ల నిషేధం తర్వాత మొదటి వికెట్ పడగొట్టి మైదానంలో భావోద్వేగానికి గురయ్యారు శ్రీశాంత్. ఇకపోతే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తన సత్తా చాటి మళ్ళీ బీసీసీఐ సెలక్టర్ల చూపును ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు  ఒకానొక సమయంలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: