పడిపోయిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్.. ఫాన్స్ షాక్..?
అయితే ఫార్మాట్ ఏదైనా సరే తనదైన దూకుడు ఆటతీరుతో ఎప్పుడూ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు అంటే ఇక స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ ఎప్పుడు టాప్ ప్లేస్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంటాడు అన్న విషయం తెలిసిందే. కానీ గత కొంత కాలం నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానంలో కి దూసుకెళ్లడంతో ఇక విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక త్వరలో విరాట్ కోహ్లీ మళ్ళీ రాణించి మొదటి స్థానం లోకి వస్తాడు అని అభిమానులు భావిస్తున్న తరుణంలో విరాట్ కోహ్లీ స్థానం మరింత దిగజారి పోయింది. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ మూడవ ర్యాంకుకు పడిపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఇటీవలే రాణించిన స్మిత్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ మూడవ స్థానానికి పడిపోయాడు. కేన్ విలియమ్సన్ 919.. స్టీవ్ స్మిత్ 900.. విరాట్ కోహ్లీ 870 పాయింట్ తో వరసగా మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.