ఈ ఏడాది ఆర్‌సి‌బి లో వీళ్ళు కష్టమే ..!!

KISHORE
 ఇండియన్ క్రికెట్ లో ఐ‌పి‌ఎల్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎంతో విజయవంతం స్వదేశీ ప్రీమియర్ లీగ్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. ఎన్నో దేశాలు ఐ‌పి‌ఎల్ తరహా టోర్నీలు నిర్వహిస్తున్నప్పటికి, ఏవి కూడా అంతగా క్రికెట్ అభిమానులకు కిక్ ఇవ్వలేదు. ఐ‌పి‌ఎల్ లో స్వదేశీ ఆటగాళ్లతో పాటుగా విదేశీ ఆటగాళ్లు కూడా ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు. ఐ‌పి‌ఎల్ అంటే తమకు ఎంతో ఇష్టమని చాలా మంది విదేశీ ఆటగాళ్లు పలు సందర్భాలలో భాహిరంగంగానే చెప్పారంటే ఐ‌పి‌ఎల్ కు ఉండే ప్రదాన్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కరోనా కారణంగా ఐ‌పి‌ఎల్ బయటి దేశంలో జరిగినప్పటికి ఐ‌పి‌ఎల్ కు ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
 అయితే ఈ ఏడాది  ఐపీల్ 2021 కోసం బీసీసీఐ సిద్దం అవుతుంది. త్వరలోనే 14 సీజన్ కోసం వేలంపాటకుండా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంచితే  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు గెలవలేక పోయింది. దీంతో కింగ్ కోహ్లీ పలు సందర్భాల్లో తమ నిరాశను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో విజేత అవుతుందని అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలు అయ్యి నిరాశతో వెనుదిరిగింది.
ఈ సారి 2021 సీజన్‌లో ఎలాగైనా కప్పు గెలవాలని ఆర్‌సి‌బి ఫ్రాంఛైజీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం జట్టులో చాలా  మార్పులు చెయ్యనున్నట్టు తెలుస్తుంది. ఫామ్ లో లేని కొంతమంది ఆటగాళ్లను వదులుకోని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీల్ వేలం నిర్వహించే నేపథ్యంలో జనవరి 21లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు విడుదల చేయాల్సి ఉంది. ఇక బెంగళూరు వదులుకోవాలనుకుంటున్న వారిలో ఉమేశ్‌ యాదవ్‌(రూ.4కోట్లు) శివమ్‌ దూబే(రూ.5కోట్లు) మొయిన్‌ అలీ(రూ.1.70కోట్లు-ఇంగ్లాండ్‌) గుర్‌కీరత్‌ మన్‌(రూ.50లక్షలు) పవన్‌ నేగీ(రూ.కోటి) ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ సారి ఆర్‌సి‌బి ఎలాంటి వారిని బరిలోకి దించుతుంది అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారైనా ఆర్‌సి‌బి ఐ‌పి‌ఎల్ ట్రోఫీని అందుకుంటుందేమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: