అందరి చూపు దానిపైనే.. హిస్టరీ రిపీట్ అవుతుందా..?
రెండవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ ను ఎంతో తెలివిగా డ్రాగా ముగించింది అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తక్కువ పరుగులకే ఆస్ట్రేలియా ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఇక నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ప్రస్తుతం టీమిండియా చివరి ఇన్నింగ్స్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇక భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న క్రికెట్ సమరానికి నేటితో తెరపడింది. రెండు టాప్ జట్లు తలపడుతుండడంతో అటు ప్రేక్షకులందరికీ అసలు సిసలైన మజా అందుతుంది.
ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అయినప్పటికీ కూడా... ఎక్కడ టీమిండియా పోరాటపటిమను మాత్రం మారడం లేదు. ఇక ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టిస్తుందా అన్నదానిపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్ర సృష్టించాలంటే కావలసింది పట్టుదల, పోరాటపటిమ. ప్రస్తుతం టీమిండియా లోని 11 మంది ఆటగాళ్లు ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు అన్నదానిపైనే ప్రస్తుతం భారత ప్రేక్షకులందరికీ చూపు ఉంది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై తాడోపేడో తేల్చుకుంటుంది భారత జట్టు.